కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు | MoS HRD Ram Shankar Katheria inciting violence in Agra | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Published Tue, Mar 1 2016 10:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు - Sakshi

కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఆగ్రా: అధికార బీజేపీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి, ఆగ్రా ఎంపీ రామశంకర్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను సైతానులు, రావణ సంతతిగా వర్ణించారు. ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ కార్యకర్త అరుణ్ మహౌర్ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'పూజలు ముగించుకుని తిరిగి వస్తున్న అరుణ్ ను హత్య చేశారు. మనం శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మొదలు పెట్టాలి. పోరాటం ఆరంభించకపోతే ఈరోజు అరుణ్ కోల్పోయాం, తర్వాత మరొకరు బలౌతారు. మరొకర్ని కోల్పోక ముందే మన బలమెంతో చూపాలి. అదిచూసి హంతకులు పారిపోయాల'ని వ్యాఖ్యానించారు. ఫతేపూర్ సిక్రీ ఎంపీ బాబూలాల్, బీజేపీ స్థానిక నేతలు, ఆగ్రా వీహెచ్ పీ  నేత అశోక్ లావణ్య కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కతిరియా తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని తాను అనలేదని, నివాళులు మాత్రమే అర్పించానని వివరణయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement