అత్తమీద కోపంతో కొడుకును.. | Mother Throws 2-Year-Old Down Stairs During Fight | Sakshi
Sakshi News home page

అత్తమీద కోపంతో కొడుకును..

Published Fri, Jan 27 2017 11:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

అత్తమీద కోపంతో కొడుకును.. - Sakshi

అత్తమీద కోపంతో కొడుకును..

న్యూఢిల్లీ: క్షణికావేశంలో సహనం కోల్పోయిన ఓ తల్లి రెండేళ్ల కొడుకుపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తీసుకెళ్లి మెట్లపై నుంచి విసిరేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్మయపరుస్తున్నాయి.

భర్త నితిన్‌ గుప్తా ఫిర్యాదుమేరకు దుశ్చర్యకు పాల్పడిన సోనూ గుప్తా(26)పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంట్లో అత్తతో గొడవపడి సోనూ గుప్తా ఈ చర్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముఖం, తలకు గాయాలైన రెండేళ్ల అన్షూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆస్తికి సంబంధించిన వాగ్వాదంతో ఊగిపోయిన సోనూ ఈ చర్యకు పాల్పడిందని నితిన్‌ తల్లి వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement