
రోడ్లపై గుంతలు పూడ్చకపోతే కిడ్నాప్ చేస్తా
అధికారికి ముంబై కార్పొరేటర్ హెచ్చరిక
ముంబై : ‘మా ప్రాంతంలో రోడ్లపై గుంతలు పూడ్చకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తా’ అంటూ ముంబై కార్పొరేటర్ ఒకరు సంబంధిత అధికారిని బెదిరించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీకి చెందిన దాదర్ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే, ‘జీ-నార్త్’ వార్డ్ ఇన్‌చార్జికి గతవారం ఇలా బెదిరిస్తూ లేఖ రాశారు.
సందీప్ స్పందిస్తూ తాను అధికారిని బెదిరిస్తూ ఉత్తరం రాశానని ఒప్పుకున్నారు. ప్రజలు తనను ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించడానికనీ, అధికారితో పనిచేయించడానికి ఈ పని చేశానని అన్నారు. వార్డు ఇన్‌చార్జ్ మాట్లాడుతూ..దాదార్ ప్రాంతంలో రోడ్లపై గుంతలను పూడ్చడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. ఇక్కడ రోడ్లన్నీ అందంగా, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉన్నాయి కాబట్టి వ్యవహార ం కిడ్నాప్ వరకు వెళ్లదని ఆయన చెప్పారు.