హోంశాఖలో నా సోర్సెస్‌ నాకున్నాయి: దిగ్విజయ్‌ | My Own Sources In Home Ministry: Digvijaya Singh | Sakshi
Sakshi News home page

హోంశాఖలో నా సోర్సెస్‌ నాకున్నాయి: దిగ్విజయ్‌

Published Wed, May 10 2017 4:33 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

హోంశాఖలో నా సోర్సెస్‌ నాకున్నాయి: దిగ్విజయ్‌

హోంశాఖలో నా సోర్సెస్‌ నాకున్నాయి: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసు శాఖపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వద్ద ఆధారాలు ఉండటం వల్లే ఆ విషయాలు చెప్పానన్నారు. హోంశాఖలో తనకు కావాల్సిన వారు ఉన్నారని వారి ద్వారా ఆ విషయాలు తెలుసుకోగలిగానని చెప్పారు.

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి తర్వాత అక్కడి బాధ్యతల నుంచి తనను తప్పించడాన్ని సమర్థించుకున్న దిగ్విజయ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు ఒక ఫేక్‌ ఐసిస్‌ వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసి మైనారిటీ యువతను ఆకర్షించి అనంతరం వారిని అరెస్టులు చేస్తుందంటూ చేసిన ఆరోపణలపై ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘హోంశాఖలు, పోలీసు శాఖలో నాకంటూ కొంత సోర్సెస్‌ ఉంది. అందువల్లే ఆ విషయం తెలుసుకోగలిగాను’ అని దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement