న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణను పలువురు పార్లమెంటేరియన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. ‘వైద్యవిద్యలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ భేటీతో పరిష్కారం వస్తుందని భావిస్తున్న’ట్లు నడ్డా ట్వీట్ చేశారు.
రెండు విడతల్లో నీట్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో విపక్షాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఈ భేటీ తలపెట్టింది. వివిధ ప్రాంతీయ భాషల్లో 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు నీట్‌లో పోటీ పడటం కష్టమవుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెల్లడించాయి.
నేడు నీట్‌పై నడ్డా కీలక భేటీ
Published Mon, May 16 2016 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement