కచేరీకి నమిత డుమ్మా | namitha drama program Away | Sakshi
Sakshi News home page

కచేరీకి నమిత డుమ్మా

Published Wed, Jun 25 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

కచేరీకి నమిత డుమ్మా

కచేరీకి నమిత డుమ్మా

 నటి నమిత సినిమాకు దూరం అయినా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమా లు ఆమెను స్వాగతిస్తూనే ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు నమిత క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య ఒక నాటక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్లి అభిమానుల అత్యుత్సాహం తో ఆ రంగస్థలమే కూలిపోవడంతో భయపడిన నమిత అభిమానులను నిరాశపరచి అటు నుంచి అటే ఇంటిముఖం పట్టారు. తాజాగా నామక్కల్‌లో నమితతో ఆటపాట మీలో ఎవరు లారెన్స్ అనే పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం మొదలైంది. 
 
 వేలమంది తిలకించడానికి హాజరయ్యారు. రాత్రి 10 గంటలకు మిమిక్రీ ఆర్టిస్ట్ మదురై ముత్తు స్టేజిమీద కొచ్చి నటి నమిత అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని తెలిపారు. దీంతో నమితతో ఆడాలని ఆశగా టికెట్ కొన్న వారితో పాటు అభిమానులు ఆవేశంతో వీరంగం సృష్టించారు. స్టేజ్‌పై రాళ్ల వర్షం కురిపించారు.   పోలీసులు అక్కడికి వచ్చి లాఠీ చార్జ్ చేశారు.  దీంతో నమిత పేరు చెప్పి తమను మోసం చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement