drama program
-
ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం
గన్‌ఫౌండ్రీ: నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. రసరంజని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఊరు భంగం అనే నాటకం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. రసరంజని సంస్థ ప్రతినిధులు, నాటక ప్రియులు పాల్గొన్నారు. -
భగత్‌సింగ్ నాటకం.. ఉరి రిహార్సల్స్ చేస్తుండగా విషాదం
బదౌన్(యూపీ): స్వాతంత్య్ర దినోత్సవం రోజు భగత్‌సింగ్ నాటక ప్రదర్శన ఇచ్చి, గ్రామస్తుల మెప్పు పొందాలనుకున్న బాలుడి ఆశలు నెరవేరలేదు. అదే నాటకం కోసం సాధన చేస్తూ ప్రాణాలొదిలాడు. భగత్‌సింగ్‌కు బ్రిటిష్ అధికారులు ఉరి వేసే దృశ్యాన్ని ప్రాక్టీస్ చేస్తుండగా నిజంగానే ఉరి బిగుసుకోవడంతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కున్వర్గావ్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాబత్ గ్రామంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూరేసింగ్ కుమారుడు శివం(10) చదువులో చురుగ్గా ఉంటాడు. ఆటపాటల్లో మేటి. గురువారం తన తోటి పిల్లలతో కలిసి భగత్‌సింగ్ నాటకంలో ఉరివేసే దృశ్యం రిహార్సల్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో శివం కథానాయకుడు భగత్‌సింగ్ పాత్ర పోషిస్తున్నాడు. రిహార్సల్స్‌లో భాగంగా శివం తన మెడకు ఉరితాడు తగిలించుకున్నాడు. ఇంతలోనే కాళ్ల కింద ఉన్న పీట జారిపోయింది. శివం మెడకు తాడు బిగుసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే వచ్చి శివంను కిందికి దించారు. తాడును తొలగించారు. అప్పటికే అతడు ఊపిరాడక మృతిచెందాడు. తమకు సమాచారం ఇవ్వకుండానే శివం మృతదేహానికి అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు చెప్పారు. -
ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...
మనకు మహానటి సావిత్రి తెలుసు. ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి. చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది. పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి. అరవై... అయితేనేం? ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్‌ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది. పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్డౌన్ పోయి, అన్‌లాక్ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు. -
కచేరీకి నమిత డుమ్మా
నటి నమిత సినిమాకు దూరం అయినా ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమా లు ఆమెను స్వాగతిస్తూనే ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు నమిత క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య ఒక నాటక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్లి అభిమానుల అత్యుత్సాహం తో ఆ రంగస్థలమే కూలిపోవడంతో భయపడిన నమిత అభిమానులను నిరాశపరచి అటు నుంచి అటే ఇంటిముఖం పట్టారు. తాజాగా నామక్కల్‌లో నమితతో ఆటపాట మీలో ఎవరు లారెన్స్ అనే పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం మొదలైంది. వేలమంది తిలకించడానికి హాజరయ్యారు. రాత్రి 10 గంటలకు మిమిక్రీ ఆర్టిస్ట్ మదురై ముత్తు స్టేజిమీద కొచ్చి నటి నమిత అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని తెలిపారు. దీంతో నమితతో ఆడాలని ఆశగా టికెట్ కొన్న వారితో పాటు అభిమానులు ఆవేశంతో వీరంగం సృష్టించారు. స్టేజ్‌పై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడికి వచ్చి లాఠీ చార్జ్ చేశారు. దీంతో నమిత పేరు చెప్పి తమను మోసం చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.