న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్తో భేటీ అయ్యారు. శుక్రవారం నిర్ణీత సమయం కంటే అరగంటే ముందే గవర్నర్ నార్త్ బ్లాక్ చేరుకుని హోం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలు చర్చకు రానున్నాయి.