
జాతీయ అవార్డు అందుకుంటున్న ఎయిమ్స్ వైద్యురాలు ఉమా కుమార్
న్యూఢిల్లీ: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ‘మన శాస్త్రవేత్తల వినూత్న ఆలోచనలు, పరిశోధనల పట్ల వారి మార్గదర్శకాలు దేశానితోపాటు ప్రపంచానికి ఎనలేని కీర్తిని తెస్తాయి’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో భారత్ శాస్త్ర, సాంకేతిక రంగం వృద్ధిలో కొనసాగడమే కాక.. యువతకు సైన్స్ పట్ల ఉత్సుకతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘మన శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు జాతీయ సైన్స్ దినోత్సవం ఒక మంచి సందర్భం’అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు.
పరిశోధనల్లో మహిళలు 15 శాతమే: కోవింద్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment