మోడీని రామ మందిరం కట్టమన్న కాంగ్రెస్ నేత | Narendra Modi must build Ram Mandir: Shankar Singh Vaghela | Sakshi
Sakshi News home page

మోడీని రామ మందిరం కట్టమన్న కాంగ్రెస్ నేత

Published Wed, May 21 2014 3:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీని రామ మందిరం కట్టమన్న కాంగ్రెస్ నేత - Sakshi

మోడీని రామ మందిరం కట్టమన్న కాంగ్రెస్ నేత

అహ్మదాబాద్ : ప్రధానమంత్రి పదవి చేపట్టనున్న నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత శంకర్ సింగ్ వాఘేలా ప్రశంసలు లభించాయి. 2 సీట్లున్న పార్టీని 282 సీట్లకు తీసుకెళ్లిన ఘనత మోడీకే దక్కుతుందని ఆయన వాఘేలా ప్రశంసించారు. మోడీకి గుజరాత్ శాసనసభ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఈ  సందర్భంగా అనూహ్యంగా బీజేపీ కీలక వాగ్దానాలకు వాఘేలా నుంచి మద్దతు లభించింది.

బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మోడీ తప్పక చేపట్టాలనన్నారు. అలాగే యూనీఫామ్ సివిల్ కోడ్‌లకు వాఘేలా మద్దతు పలికారు. అటు సభాపతి కూడా మోడీకి అభినందనలు తెలిపారు. స్వతంత్ర భారత లక్షాలను సాధించాల్సిన బాధ్యత బీజేపీ సర్కారుపై ఉందని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement