చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు: ప్రధాని | Narendra modi praises Everest Winners | Sakshi
Sakshi News home page

చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు

Published Sat, Jun 7 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు:  ప్రధాని

చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు: ప్రధాని

తెలుగు తేజాలకు ప్రధాని అభినందన
 సాక్షి, న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను శుక్రవారం ప్రధాని మోడీ అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించారని వారిని ప్రశంసించారు. ప్రధాని నివాసమైన రేస్‌కోర్సులో శుక్రవారం పూర్ణ, ఆనంద్‌లు నరేంద్రమోడీని కలశారు.  శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. భారత ఖ్యాతిని ఇనుమడింపజేశారంటూ వారిని అభినందనలతో ముంచెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వీరికి ఎవరెస్టు ఎక్కేందుకు సహకరించిన వారి వివరాలను పూర్ణ, ఆనంద్‌ల నుంచి తెలుసుకున్న ప్రధాని ముగ్ధుడైనట్లు కోచ్ శేఖర్‌బాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మోడీ వారిద్దరినీ ఆశీర్వదించారని ప్రధానమంత్రి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement