సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్ను క్రమేణ సడలించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రులను సూచించినట్లు తెలిసింది. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ: ‘కరోనాకు వ్యతిరేకంగా పోరాడడంలో యావత్ ప్రపంచం నేడు మనల్ని ప్రశంసిస్తోంది. ఈ పోరాటంలో ప్రధాన పాత్రను రాష్ట్ర ప్రభుత్వాలే పోషించాయి. రాష్ట్రాలు తమ బాధ్యతలేమిటో గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాయి’ అని ఆయన ప్రశంసించారు. (మూడు విడతలుగా లాక్‌డౌన్ ఎత్తివేత)
‘తమవారికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి తమ ఇళ్లకు వెళ్లాలని ఉంటుంది. అది మానవ నైజం. అందుకని మన నిర్ణయాలను సవరించుకోవాల్సి లేదా మార్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ వైరస్ గ్రామాలకు సోకకుండా చూడాల్సిన బాధ్యత మనదే. ఇది మనకో పెద్ద సవాలు’ అని వలస కార్మికులను దష్టిలో పెట్టుకొని మోదీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇప్పుడు మనం క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంలో భాగంగా సడలింపులపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పినట్లు సమాచారం. (బెంగాల్‌లో ఎలా తనిఖీ చేస్తాయి?: మమత)
Comments
Please login to add a commentAdd a comment