న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 69వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి’ అంటూ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఛత్తీస్‌లో నక్సల్స్ దాడులు, కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా వేడుకలకు దూరంగా ఉండాలని సోనియా నిర్ణయించుకున్నారు.