గణితానికి కొత్త టెక్నిక్.. లెక్కలు ఇక సులువు!
హైదరాబాద్: దేశ విద్యారంగంలో కొత్త మార్పు రాబోతుందా?. రెండేళ్ల క్రితం ఓ పదిహేనేళ్ల విద్యార్థి అంతర్జాతీయ వేదిక మీద మ్యాథ్స్‌లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ దేశీయ విద్యారంగ నిపుణులను ఓ గణితం టెక్నిక్ అమితంగా ఆకర్షించింది. అదే షాంఘై టెక్నిక్. ఈ టెక్నిక్‌ను భారతీయ విద్యావ్యవస్ధకు అనుకూలంగా మార్చి అమలు చేస్తే ఎలా ఉంటుందనే భావన చాలా మంది విద్యావేత్తల మదిలో ఉంది. అయితే, భారత్‌లో ప్రస్తుతం అనుసరిస్తున్న మెథడ్‌కు ఇది చాలా విభిన్నం.
షాంఘై టెక్నిక్‌ను అమలు చేయాలంటే దేశంలోని ఉపాధ్యాయులకు ఐదేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అంతేకాదు ఆ తర్వాత ఒక తరగతి గదిలో కేవలం 15 నుంచి 16 మంది విద్యార్థులకే పాఠాలు బోధించాలి. అప్పుడే గణితంలో అందరూ సమానంగా రాణించేందుకు అవకాశం కలుగుతుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో విద్యకు అన్నీ సౌకర్యాలు ఉన్నా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న గ్రామాల్లో ఈ వ్యవస్ధ ఎలా సాధ్యపడుతుందనే ప్రశ్నలూ ఉన్నాయి.
షాంఘై టెక్నిక్‌పై మాట్లాడిన విద్యావేత్త చుక్కా రామయ్య.. ఈ మెథడ్ కారణంగా విద్యార్థుల్లో సమానత్వం ఏర్పడుతుందని, 16 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న విద్యార్థులకు దీన్ని అమలు చేయోచ్చని అన్నారు. భారత్‌లో షాంఘై మెథడ్, లోకల్ మెథడ్‌లకు మధ్యస్తంగా ఉండే మెథడ్‌ను అమలు చేయడం ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.