
బడ్జెట్ టార్గెట్ : 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రదాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల సత్వర పూర్తికి కృషి చేస్తామన్నారు.
పార్లమెంట్‌లో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మేకిన్ ఇండియాను మరింత మెరుగుపరుస్తామని ఆమె చెప్పారు. భారత్‌ను మరింత ఉన్నత స్ధాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. కాలుష్య రహిత భారత్‌గా దేశాన్ని రూపొందిస్తామని అన్నారు.ఇన్‌ఫ్రా, డిజిటల్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని అన్నారు. 2014-19 మధ్య ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.