ప్రతీకాత్మక చిత్ర
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ సోకే ముప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా.. మాస్క్‌లు ధరించి ఎవరితోనైనా ముఖాముఖిగా 4 నిమిషాల్లోపు ఉంటేనే ‘లో రిస్క్’లో ఉన్నట్టని అమెరికా ప్రభుత్వ సెంటర్‌ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఓ నివేదికలో పేర్కొంది. ఎవరైనా ఆరడుగుల దూరంలో ఉన్నా అది 45 నిమిషాల లోపైతేనే ‘లో రిస్క్’అని వెల్లడించింది. ఎవరైనా పక్క నుంచి నడుస్తూ, పరిగెడుతూ, సైక్లింగ్ చేస్తూ వెళ్లినా అది తక్కువ ప్రమాదంలో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బాగా వెలుతురున్న ప్రదేశాల్లో మనుషుల మధ్య దూరం పాటించడం వల్ల తక్కువ ప్రమాదమేనని, నిత్యావసరాలు, సరుకుల కొనుగోలుకు వెళ్లినపుడు మధ్యంతర ప్రమాదం (మీడియం రిస్క్), ఇండోర్ స్పేసెస్‌లో హైరిస్క్ పొంచి ఉన్నట్టుగా వివరించింది. పబ్లిక్ బాత్‌రూంలు, కామన్ ఏరియాల్లో కొంచెం రిస్క్ ఉంటుందని తెలిపింది. వైరస్ వ్యాప్తికి ఉపరితలాలు, బహిరంగ కార్యకలాపాలతో ‘వెరీలో రిస్క్’.. అదే ఏసీ షాపులు, ఆïఫీసులు, స్కూళ్లు, వివిధ పని ప్రదేశాల్లో డిస్టెన్స్ పాటించినా ‘వెరీ హైరిస్క్’కు అవకాశమున్నట్టుగా పేర్కొంది. (ర్యాపిడ్ టెస్టులకు ఓకే)
రిస్క్‌ను గమనిస్తూ మసలుకోవాలి..
ఇటు బిజినెస్ నెట్ వర్కింగ్/కాన్ఫరెన్స్‌లు, పార్టీలు/పెళ్ళిళ్లు, కచెరీలు/సినిమా హాళ్లలో ‘హై రిస్క్’అవకాశాలున్నట్టుగా సీడీసీ నివేదికలో పేర్కొంది. అందువల్ల ఇంట్లో/బహిరంగ ప్రదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా మసలుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరుకుగా ఉన్న ప్రాంతాలు, బాగా వెలుతురున్న, విశాల ప్రాంతాలు, అధిక జనసమ్మర్థం, తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలను విభజించుకుంటూ దానికి అనుగుణంగా సమయాన్ని వెచ్చించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment