నా పాత్ర ఏమీలేదు: దాసరి నారాయణరావు | None of my role: Dasari Narayana Rao | Sakshi
Sakshi News home page

నా పాత్ర ఏమీలేదు: దాసరి నారాయణరావు

Published Mon, Dec 8 2014 7:37 PM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

దాసరి నారాయణరావు - Sakshi

దాసరి నారాయణరావు

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసుతో తనకు ఏమీ సంబంధంలేదని  కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఆయనను  ప్రశ్నించింది. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని దాసరి  పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని ఆయన 9 పేజీల వాంగ్మూలం ఇచ్చారు. సిరి మీడియాలో తనకు ఎటువంటి షేర్లు లేవని తెలిపారు.

ఈ నెల 18న దాసరిని మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించుకుంది. దాసరికి ఆరోగ్యం బాగోలేనందున మరోసారి విచారణకు పిలుస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. సిరి మీడియా డైరెక్టర్లను కూడా ఈడీ విచారించనుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement