సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలాడు
సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలాడు
Published Sun, Feb 1 2015 3:13 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
జైపూర్: సర్పంచ్ పదవికి కోసం రూ. 2 కోట్ల ఉద్యోగాన్నే వదిలేశాడు ఓ ఎన్ఆర్ఐ. 27 ఏళ్ల హనుమాన్ చౌదరి అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లోని ఓ రిసార్ట్లో మేనేజర్గా ఉద్యోగం చేసేవాడు. అతని వార్షిక వేతనం దాదాపు రూ.2 కోట్ల రూపాయలు. అయితే తండ్రి భురాం అతన్ని స్వస్థలానికి త్వరతగతిన రావాలని ఫోన్ చేశాడు. అందుకు కారణం మాత్రం సర్పంచ్ పదవికి పోటీ చేయడమే. రాజస్తాన్ లోని నగౌర్కి చెందిన హనుమాన్ తన తండ్రి మాట పట్టుకుని ఆగమేఘాల మీద ఇండియాకు వచ్చేశాడు. ఇందులో భాగంగానే తండ్రి మాటకు గౌరవం ఇస్తూ సర్పంచ్ పోటీలో నిలుచుని గెలుపొందాడు.
అయితే తండ్రి ఆస్ట్రేలియా నుంచి చౌదరిని తిరిగి రమ్మడానికి ఓ కారణం కూడా ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి కనీస విద్యార్హతని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులని ఇచ్చింది. దీని ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎనిమిదో తరగతి, పంచాయితీ సమితిలో సభ్యులుగా ఉండడానికి 10వ తరగతి చదివి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులతో ఆ ఉళ్లోని 85 శాతం ప్రజలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్నవారందరూ అనర్హులు.
''8 వతరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మా ఊళ్లోని చాలా మంది నన్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ విషయమై మా అన్నయ్యని సంప్రదించగా సమాజ సేవా చేయాలనుకుంటే తిరిగి రావొచ్చు అన్నారు. అయన ప్రోత్సాహంతోనే ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాను'' అని చౌదరి అన్నారు.
Advertisement
Advertisement