నర్సుపై గ్యాంగ్ రేప్ | Nurse gang-raped in Indore | Sakshi
Sakshi News home page

నర్సుపై గ్యాంగ్ రేప్

Published Fri, May 15 2015 7:01 PM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM

నర్సుపై గ్యాంగ్ రేప్ - Sakshi

నర్సుపై గ్యాంగ్ రేప్

ఇండోర్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గురువారం రాత్రి ఇద్దరు యువకులు ఓ నర్సుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తున్న నర్సు (20) విధులు ముగించుకుని రాత్రి 9 గంటలకు తన స్నేహితుడితో కలసి బైక్పై బయల్దేరింది. సహారా సిటీ టౌన్ షిప్ దగ్గరకు వెళ్లాకు నలుగురు యువకులు వీళ్లను ఆపారు. 18-20 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు మద్యంమత్తులో ఉన్నారు. ఇద్దరు యువకులు నర్సును పొదలమాటుకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు యువకులు ఆమె స్నేహితుడిని బంధించి అతడి నుంచి బైకు, మొబైల్ దోచుకున్నారు. గంట తర్వాత వీరిలో ఒకడు నర్సు వద్దకు వెళ్లగా, ఆమె స్నేహితుడు తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలికి వెళ్లారు.  ఈ విషయం గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిలో ఒకడు ఇంటర్ విద్యార్థి ఉన్నాడు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement