
భోపాల్: కరోనా లక్షణాలతో ఇండోర్ ఆసుపత్రిలో చేరిన నర్సు(55) బుధవారం మృతి చెందింది. సదరు మృతురాలిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో మంగళవారం రాత్రి ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ ప్రమేంద్ర ఠాకూర్ తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు ఇండోర్‌లోనే అత్యధికంగా నమోదైన సంగతి తెలిసిందే. (కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు)
దీనిపై ప్రమేంద్ర ఠాకూర్ మాట్లాడుతూ.. మృతురాలైన నర్సు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతోందని, దీంతో ఆమె నమూనాలను కోవిడ్-19 పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. అయితే ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదని, అవి వచ్చాకే ఆమె మృతికి గల కారణాలను స్పష్టం చేయగలమన్నారు. కాగా అదే హాస్పిటల్ ఆఫీసులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తోన్న సదరు మృతురాలు ఏప్రీల్ 1 నుంచి అనారోగ్యం బారిన పడిందని చెప్పారు. ఇక అప్పటీ నుంచి ఆమె విధులకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నాడు. కాగా ఇండోర్ జిల్లాలో ఇప్పటివరకు 923 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇందులో 52 మంది మరణించారు. మరో 73 మంది కోలుకోని డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. (కరోనా పరీక్షల్లో ఏపీకి మొదటి స్థానం)
Comments
Please login to add a commentAdd a comment