వీవీఐపీలకూ మినహాయింపు లేదు! | Odd-numbered cars to run on Monday, Wednesday and Friday | Sakshi
Sakshi News home page

వీవీఐపీలకూ మినహాయింపు లేదు!

Published Sun, Dec 6 2015 7:38 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

వీవీఐపీలకూ మినహాయింపు లేదు! - Sakshi

వీవీఐపీలకూ మినహాయింపు లేదు!

న్యూఢిల్లీ: దేశరాజధాని హస్తినలో కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్‌ ఫార్ములాకు సంబంధించిన విధివిధానాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని తెలిపింది. అత్యవసర వాహనాలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వ్యాన్లకు ఈ ప్రణాళిక వర్తించదని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

అయితే, వీవీఐపీలైన మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు ఈ ప్రణాళిక నుంచి మినహాయింపు ఉండబోదని, వారు కూడా దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీలో విషపూరితమైన వాయుకాలుష్యాన్ని నివారించేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను అమలుచేస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఈ ప్రణాళిక వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైతే.. పది, పదిహేను రోజులు చూసి.. ఈ ప్రణాళికను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement