ఢిల్లీ: దేశంలోని దాదాపు నాలుగు కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిర్వహణ మరింత సుల భతరం కానుంది. ఇక ఈపీఎఫ్ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగులు రేపటి నుంచి ఈ సేవలను వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. ఒకే ఒక్క సార్వత్రిక నంబర్ విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ కొత్త విధానాన్ని అనుసరించనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తెస్తామని కేంద్ర భవిష్య నిధి (సీపీఎఫ్) కమిషనర్ కె.కె.జలాన్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ విధానంతో ప్రస్తుతం ఉన్న యాజమాన్య ఆధారిత విధానం పూర్తిగా ఉద్యోగి కేంద్రంగా మారుతుంది. ఉద్యోగి వేరే సంస్థకు మారినా, మరో ప్రాంతానికి బదిలీ అయినా అతని సార్వత్రిక భవిష్యనిధి నంబరు బ్యాంకు ఖాతా నంబర్‌లా శాశ్వతంగా ఉంటుంది. ఇక పెన్షనర్లందరికీ నవంబర్ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్ చేతికందుతుండటమే గాక ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్ ద్వారా బది లీ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.