'అవమానించారు! సారీ.. మాకు ఆ ఉద్దేశం లేదు'
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రతి పక్షాలు విరుచుపడ్డాయి. తమను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత రాజ్యాంగ పిత బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారక భవనాన్ని లండన్ లో ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు ఓ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సహా మరికొందరు వెళుతున్నారు. ఇందులో ఒక్కరు కూడా ప్రతిపక్షానికిచెందిన వారు లేరు.
దీంతో అసలు తమకు ఆహ్వానాలే పంపించలేదని, ఇలా చేసి తమను అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై వివరణ ఇచ్చిన ఫడ్నవీస్ ఆకార్యక్రమం తాము నిర్వహించేది కాదన్నారు. లండన్ అధికారులు దానిని నిర్వహిస్తున్నారని ఆహ్వానాలు కూడా చాలా తక్కువమందికే అవకాశం ఉందని వివరించారు. ఇందులో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని బదులిచ్చారు. ఇందులో ప్రతిపక్షాలు లేనిపోని మాటలు అనాల్సిన అవసరం లేదని చెప్పారు. అది ఒక చిన్న కార్యక్రమం మాత్రమేనని చెప్పారు. అంబేద్కర్ స్కాలర్ గా ఉన్నప్పుడు కొన్ని రచనలు చేశారని, వాటిని అంబేద్కర్ భవనంలోని రెండు, మూడో ఫ్లోర్ లో భద్ర పరుస్తున్నారని, ఆ కార్యక్రమానికి తాము హాజరవుతున్నామని చెప్పారు.