బోరివలి, న్యూస్‌లైన్: రాబోయే శాసన సభ ఎన్నికలల్లో శివసేన పార్టీకే మద్దతు ఇవ్వనున్నట్లు గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని తెలుగు చర్చీల పాస్టర్లు తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం పశ్చి మ గోరేగావ్ పరిధి మోతీలాల్ నగర్‌లో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ అనే తెలుగు చర్చిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పాస్టరు ఆర్.ఎస్. రత్నం మాట్లాడారు. స్థానిక తెలుగు పాస్టర్లు అందరూ గతంలో వేర్వేరు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఐక్యత దెబ్బతిన్నదన్నారు.
తమ సమస్యల పరిష్కారానికి అన్ని చర్చీలు ఏకతాటిపైకి వచ్చి శివసేన పార్టీకి మద్దతు ఇవ్వాల్సి న అవసరం ఉన్నదన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే సుభా ష్ దేశాయ్‌ను గెలిపు కోసం కృషి చేయాలని కోరా రు. శివసేన నాయకుడు ప్రకాష్ స్వామి మాట్లాడుతూ శివసేన పార్టీకి మద్దతు ప్రకటించిన తెలుగు పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శివసేన మహారాష్ట్ర తెలుగు సంఘటన కార్యధ్యక్షుడు ప్రకాష్ స్వామి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని 12 మంది తెలుగు చర్చీల పాస్టర్లు పాల్గొన్నారు.
శివసేనకే మా మద్దతు
Published Sun, Sep 21 2014 11:14 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement