పాక్‌పై రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అసుస్థిరం చేసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి జమ్ముకశ్మీర్‌లో యువతను ఉపయోగించుకుంటూ వారితోటే దేశ భద్రతా బలగాలపై రాళ్ల దాడి చేయిస్తున్నాయని అన్నారు. ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే కాదు మొత్తం భారతదేశంలోనే స్థిరత్వం లేకుండా చేయాలని పాకిస్థాన్ వెన్నుపోటు చర్యలకు దిగుతోంది.
మొత్తం దేశానికి కూడా పాక్ చేస్తున్న దుశ్చర్యలు తెలుసు. ఎంతమేరకు అవసరం అవుతుందో ఆ మేరకు మన బలగాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కశ్మీర్‌లో కొత్త పద్ధతి మొదలైంది. ఉగ్రవాదులను వెతికేందుకు బలగాలు గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లగానే అక్కడి యువత రాళ్లు విసురుతున్నారు. వీరంతా కూడా ఉగ్రవాదుల కారణంగా తప్పుదోవపడుతున్నవారే. ఫేస్‌బుక్, వాట్సాప్‌వంటి సోషల్ మీడియాల ద్వారా పాక్ యువతను తప్పుదోవపట్టిస్తోంది’ అని విరుచుకుపడ్డారు.