పాక్ దర్యాప్తు బృందాన్ని ఉటంకిస్తూ పాక్ మీడియా కథనాలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి ఊతమిస్తూనే మరోవైపు ఉగ్రవాదంపై పోరాడుతున్నామంటూ చెప్పుకురావడమే కాదు... ఇప్పుడు అసలు భారత్‌వన్నీ నాటకాలంటూ పాకిస్తాన్ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. పఠాన్‌కోట్ ఘటన నేపథ్యంలో భారత్‌లో పర్యటించిన ‘పాక్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని’ ఈ దుష్ర్పచారానికి వినియోగించుకుంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి అంతా భారత్ ఆడిన నాటకమని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం(జిట్) పేర్కొన్నట్లు పాక్ ప్రభుత్వ అనుకూల‘పాకిస్తాన్ టుడే’ కథనాలు ప్రచురించింది.
అయితే పాక్ బృందం ఇంకా తమ నివేదికను బహిర్గతం చేయలేదు. మరికొద్ది రోజుల్లో తమ నివేదికను పాక్ ప్రధానికి అందజేయనుంది. కానీ ‘పాకిస్తాన్ టుడే’ పత్రిక ఆ దర్యాప్తు బృందంలోని పేరు వెల్లడించని ఓ అధికారిని ఉటంకిస్తూ... పఠాన్‌కోట్‌లో దాడి జరిగిన కొద్ది గంటల్లోనే దాడి చేసినవారిని భారత భద్రతా దళాలు కాల్చి చంపాయి. కానీ 3 రోజులపాటు అతి భారీగా ఆ దాడులు కొనసాగినట్లు నాటకం ఆడారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిపడేలా చేసి, పాక్ ప్రతిష్టను దెబ్బకొట్టాలని చూశారు. దాడిపై భారత్ ఆరోపణలను నిరూపించే ఎలాంటి ఆధారాలూ లేవు’ అని చెప్పినట్లు పేర్కొంది.
రెండునాల్కల ధోరణి..: భారత్
పాక్ మీడియా కథనాలను భారత ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి. హతమైన నలుగురు ఉగ్రవాదుల డీఎన్‌ఏ నివేదికలు సహా పూర్తి, బలమైన ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు అందజేశారన్నాయి. కాగా, ప్రధాని మోదీ పఠాన్‌కోట్‌కు పాక్ బృందాన్ని ఆహ్వానించి మన సైనికులు, అమరవీరులను అవమానించారని.. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.
పఠాన్‌కోట్ దాడి ఓ డ్రామా!
Published Wed, Apr 6 2016 2:45 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
Advertisement
Advertisement