సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడి, లాక్‌డౌన్‌లపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఇది ఐదవసారి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోన్న క్రమంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్ర నిధుల కొరతతో పలు రాష్ట్రాల సీఎంలు ఆర్థిక ప్యాకేజ్‌ను కోరే అవకాశం ఉంది.
మరోవైపు మే 17న లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటంతో తదుపరి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై ప్రధాని సీఎంల అభిప్రాయం కోరుతున్నారు. ఇక మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణపైనా ప్రధాని ఈ భేటీలో ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్, హోం మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment