యోగికోసం అధికారులను ప్రత్యేకంగా పంపిన మోదీ
లక్నో: యూపీ రాజకీయాల్లో ఆదిథ్యానాథ ఓ రాజకీయ సంచలనం. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే పలు సంచలానత్మక నిర్ణయలు తీసుకున్నారు. యాభై రోజుల పరిపాలనలో రాష్ట్రంలో 200మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థాన బ్రంశం కలిగించి సంచలనం సృష్టించారు.
ఈ బదిలీల్లో భాగంగా పదిమంది అదనపు అధికారులు కావాలని ఆదిత్యానాథ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి అడిగారు. రాష్ట్రంలో సీనియర్ అధికారులు కొరత ఉందని, పరిపాలనాత్మక సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పదిమంది అదనంగా కావాలని ప్రధానిని కోరారు. దీనిపై స్పందిచిన ప్రధాని మోదీ ప్రస్తుతానికి ఐదుగురిని కేటాయించారు. మరో ఐదుగురిని తర్వాత కేటాయించనున్నారు.
ఇందుకోసం ఉత్తర ప్రదేశ్ నుంచి ఎన్నకైన ముప్పైమంది ఐఏఎస్ అథికారుల జాబితాను తయారు చేశారు. అందులో పదిమందిని ఎంపిక చేశారు. కాని అందులో కొంత మంది, పలు కారణాలతో యూపీ వెళ్లడానికి నిరాకరించారు. దీంతో ఐదుగురిని మాత్రమే పంపిస్తున్నారు. ఇందులో 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవినాష్ కుమార్‌అవాస్తిని గత నెల లక్నోకు వెళ్లారు.
ప్రస్తుతం 1992బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శ్రీవాస్తవ, అలోక్‌కుమార్, 1989బ్యాచ్‌కు చెందిన శశిప్రకాశ్ గోయల్, సంజయ్ భూష్‌రెడ్డి, ప్రశాంత్ త్రివేదిలను కేంద్రం యూపీకీ కేటాయించింది. వచ్చే నెలలో ప్రపంచ యోగా దినోత్సవం ఏర్పాట్లును పరిశీలిస్తున్న శ్రీవాస్తవకు అక్కడకు వెళ్లడానికి ఒక నెల గడువుఇచ్చింది.