
న్యూఢిల్లీ: చరిత్రలో భారత్ ఎప్పుడూ ఇతర దేశాలపైకి దండెత్తలేదనీ, దురాక్రమణలకు పాల్పడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఢిల్లీలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
బుద్ధుని బోధనలు మానవత్వంపై ఆధారపడి ఉంటాయనీ, బౌద్ధం మన దేశంలో ఉద్భవించడం మనకు గర్వకారణమని అన్నారు. ‘జాతి, మత, కుల, భాషల మధ్య సమాజంలో తేడాలు బుద్ధుని బోధనలు కానే కావు. ఏ దేశం నుంచి ఎవరు భారత్‌కు వచ్చినా ఈ దేశం ఆదరిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.