న్యూఢిల్లీ: ఢిల్లీలోని జన్‌పథ్ ప్రాంతంలో ‘బీఆర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ సామాజిక, ఆర్థికాంశాలను పరిశోధించేందుకు కీలకమైన కేంద్రంగా మారనుందని వ్యాఖ్యానించారు. ‘అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఇదో స్ఫూర్తి కేంద్రంగా మారనుంది. కేంద్రం ద్వారా అంబేడ్కర్ స్వప్నాన్ని యువత అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. బుద్ధిజం, ఆధునిక వాస్తుశాస్త్రం ఆధారంగా ఈ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్, మౌ, లండన్ ప్రాంతాలను యాత్రాస్థలాలుగా మార్చామని పేర్కొన్నారు. కేంద్రంలో రెండు అంబేడ్కర్ విగ్రహాలను మోదీ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment