140గంటలు.. ఐదు దేశాలు.. 33,000 కిలోమీటర్లు | PM Narendra Modi's tour covers five nations in 140 hours | Sakshi
Sakshi News home page

140గంటలు.. ఐదు దేశాలు.. 33,000 కిలోమీటర్లు

Published Tue, Jun 7 2016 11:08 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

140గంటలు.. ఐదు దేశాలు.. 33,000 కిలోమీటర్లు - Sakshi

140గంటలు.. ఐదు దేశాలు.. 33,000 కిలోమీటర్లు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తాను దృఢమైన వ్యక్తి అని నిరూపించుకున్నారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తనదైన ముద్రను వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 140గంటల్లో ఆయన ఐదు దేశాలు చుట్టేశారు. దాదాపు 33 వేల కిలో మీటర్లు ప్రయాణించారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ కేవలం అలుపులేకుండా 140 గంటల్లో ఐదు దేశాలు చుట్టేయడం చెప్పుకోదగిన విషయమే. అంతేకాకుండా, ఈ ఐదు దేశాల్లో ఆయన దాదాపు 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 గంటలపాటు విమానంలో ప్రయాణించారు. మోదీ తిరిగి ఢిల్లీలో ఈ నెల పదిన ఉదయం 5గంటలకు అడుగుపెట్టనున్నారు. 'ఐదు దేశాలు, 45కు పైగా సమావేశాలు.. అది ఇక్కడ కావొచ్చు.. విదేశాల్లో కావొచ్చు.. నేను దేశం కోసమే పనిచేస్తున్నాను' అని మోదీ గత ఆదివారం దోహాలో చెప్పిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement