foriegn tours
-
ఇదేమీ స్కూల్ కాదు.. సూపర్స్టార్లు అయినా తప్పదు: చీఫ్ సెలక్టర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవేశపెట్టిన ‘పటిష్ట జట్టుకు పది సూత్రాల’ అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిబంధనలు కఠినతరం చేశామే తప్ప.. ఇవేమీ స్కూలు పిల్లలకు ఇచ్చే పనిష్మెంట్లు కావని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుడు పరిణతి గలిగిన వ్యక్తులేనని.. సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారన్నాడు.అయితే, జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు ప్రతి ఒక్కరు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రతి టీమ్‌లోనూ రూల్స్ ఉంటాయని.. జట్టు అభివృద్ధి, ప్రయోజనాలు మాత్రమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు రోజురోజుకు మరింత మెరుగుపడటానికి మాత్రమే నిబంధనలు విధించినట్లు తెలిపాడు.బీసీసీఐ ప్రవేశపెట్టిన పది సూత్రాల పాలసీదేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందే ‘స్టార్ హోదాతో దేశవాళీ క్రికెట్‌ను అటకెక్కించిన ఆటగాళ్లు ఇకపై బరిలోకి దిగాల్సిందే. టీమిండియాకు ఎంపిక కావాలంటే రంజీ మ్యాచ్‌లు, ఇతర దేశవాళీ టోర్నీలలో ఆటగాళ్లంతా వారి వారి రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండాలి. సహేతుక కారణం ఉంటే తప్ప... తప్పుకోవడానికి యువ ఆటగాళ్లకే కాదు సీనియర్లకు ఇకపై వీలుండదు’బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవు టోర్నీలు, సిరీస్‌లు జరుగుతుంటే ఇకపై ‘బ్రాండింగ్’ షూటింగ్‌ల్లో పాల్గొనడం కుదరదు. ఆటగాళ్లు కుదుర్చుకున్న ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం సిరీస్ మధ్యలో ఫొటో షూట్స్ నిషిద్ధం.కుటుంబసభ్యుల అనుమతికి ఓ పరిమితి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఆ ద్వైపాక్షిక సిరీస్ 45 రోజులకు మించి సుదీర్ఘంగా సాగితే క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా అసాంతం ఉంటామంటే ఉండనివ్వరు. 45 రోజులు ఆ పైన పర్యటనల కోసం ఇకపై రెండు వారాలపాటే కుటుంబసభ్యుల్ని అనుమతిస్తారు. స్వల్పకాల పర్యటనలకు మాత్రం వారం పరిమితే ఉంటుందిక! జట్టుతో పాటే పయనం ఇప్పటి వరకు ఆటగాళ్లు విడతల వారీగా, పర్యటన షెడ్యూల్‌కు ఉన్న సమయానికి అనుకూలంగా ఆటగాళ్లు ఆయా దేశాలకు వేర్వేరుగా పయనమయ్యేవారు. కానీ ఇక మీదట ఓ జట్టుగా సహచరులతో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తద్వారా జట్టులో అను‘బంధం’ బలపడేందుకు దోహదం చేస్తుంది. అనివార్య కారణాలు లేదంటే తప్పనిసరై ఫ్యామిలీతో ప్రయాణించాలంటే మాత్రం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి! వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు జట్టులో ఎంత సీనియరైనా, దిగ్గజమైనా తమ వెంట వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తామంటే అనుమతించరు. సదరు సిబ్బంది అవసరమనుకుంటే ఆ ఆటగాడు కచి్చతంగా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుంది.‘అదనపు’ లగేజీ భారం ప్లేయర్లపైనే... విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఆటగాళ్ల లగేజీపై ఎలాంటి ఆంక్షలు, పరిమితుల్లేవు. ఎన్ని కేజీలు తీసుకెళ్లినా ఆ భారాన్ని బోర్డే భరించేది. కానీ ఇకపై ఒక ఆటగాడు 150 కేజీలకు మించి లగేజీ తీసుకెళితే ఆ భారం ఆటగాళ్లే మోయాలి.కలసికట్టుగా ప్రాక్టీస్ సన్నాహాలకు ఆటగాళ్లంతా సమయానికి అందుబాటులో ఉండాలి. నెట్స్‌లో శ్రమించేందుకు వెళ్లే సమయంలో తమకు వీలుచిక్కిన సమయంలో స్టేడియానికి చేరకుండా... అంతా కలిసి ఒకే బస్సులో ప్రాక్టీసుకు బయలు దేరాలి.బోర్డు కార్యక్రమాలకు హాజరు బీసీసీఐ నిర్వహించే సమావేశాలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు భారత ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలి. ఇది క్రికెట్ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది.మ్యాచ్‌లు ముగిశాక... ఏదైనా పర్యటన, సిరీస్, టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇష్టారీతిన ఎవరికివారు హోటల్ గదులకు వెళతామంటే కుదరదు. అందరు కలిసి జట్టుగా వెళ్లాలి. జట్టుతో పాటే పయనించాలి. గదుల్లోనూ కలిసిమెలిసే బస స్టార్ ఆటగాళ్లకు విడిగా ప్రత్యేక గదులిస్తున్నారు. ఇకపై రెండు వారాలు, ఒక వారం కుటుంబసభ్యుల పరిమితికి లోబడి మాత్రమే ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. మిగతా సమయంలో సహచర ఆటగాళ్లతో గదుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. చదవండి: అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ -
పీక్స్‌లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!
బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చైనా బుకింగ్ వెబ్సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. అంతమయ్యే లక్షణాలే! చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు. -
ఛలో ఫారిన్
సినిమా చిత్రీకరణలు మెల్లిగా ప్రారంభం అవుతున్నాయి. పకడ్బందీగా సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాయి చిత్రబృందాలు. విదేశీ షూటింగ్స్ వీలవుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ పక్కా ప్లానింగ్‌తో విదేశాల్లోనూ సురక్షితంగా చేయొచ్చు అని బాలీవుడ్లో ఓ చిత్రబృందం లండన్ వెళ్లి చూపించింది. మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా విదేశాలు ప్రయాణం అవుతున్నారు. ‘ఛలో ఫారిన్’ అంటున్న చిత్రబృందాల వివరాలు చూద్దాం. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారట. ఫారిన్ షెడ్యూల్‌తోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ టీమ్ అమెరికా ప్రయాణం ఉంటుందని సమాచారం. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధా కృష్ణ దర్శకుడు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లవ్‌స్టోరీ ఇది. లాక్డౌన్ ముందు వారం కూడా ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను జార్జియాలో పూర్తి చేశారు చిత్రబృందం. కొన్ని కీలక ఎపిసోడ్ల కోసం మరోసారి విదేశాలు వెళ్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్షయ్ కుమార్: ఫారిన్లో షూటింగ్ ప్రారంభించిన తొలి చిత్రం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బెల్ బాటమ్’. సుమారు 120 మందితో లండన్ వెళ్లింది ‘బెల్ బాటమ్’ టీమ్. 14 రోజులు క్వారంటైన్లో ఉండి ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. సినిమా చిత్రీకరణ దాదాపు లండన్‌లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. 1980లలో జరిగే కథాంశంగా ఈ చిత్రకథ ఉండబోతోంది. ఇందులో డిటెక్టివ్‌గా కనిపించనున్నారు అక్షయ్. హ్యూమా ఖురేషి, వాణీ కపూర్, లారా దత్తా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి రంజిత్ యం. తివారీ దర్శకుడు. ఆమిర్ ఖాన్: హాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ను ‘లాల్ సింగ్ చద్దా’గా హిందీలో రీమేక్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల వచ్చే ఏడాదికి విడుదలను పోస్ట్‌పోన్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ సగం వరకూ అయిందట. మిగతా భాగాన్ని టర్కీలో పూర్తి చేస్తారట. దీనికి సంబంధించిన లొకేషన్స్ చూడటానికి ఇటీవలే టర్కీ కూడా వెళ్లి వచ్చారు ఆమిర్. త్వరలోనే ఈ చిత్రబృందం టర్కీ ప్రయాణం కానుంది. ఇందులో కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకుడు. షారుక్ ఖాన్: ‘జీరో’ (2018) తర్వాత రెండేళ్లు విరామం తీసుకున్నారు షారుక్. తాజాగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఉపాధి కోసం వలస వెళ్లే హీరో చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని టాక్. పంజాబ్, కెనడా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. సుమారు కొన్ని నెలలపాటు కెనడాలో చిత్రీకరణ కోసం ప్లాన్ చేస్తుందట చిత్రబృందం. ప్రస్తుతం ప్రయాణానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. -
విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు.. ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్ ఇన్సిట్యూషనల్ క్వారంటైన్లో, 7 రోజులు హోం క్వారంటైన్లోఉంటామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి. ► అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఎలాంటి కోవిడ్–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. ► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ► ప్రయాణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి. ► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్/షిప్ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. -
ఎన్ఎస్జీ సభ్యత్వానికి ఒబామా ఓటు
మోదీతో భేటీలో అమెరికా మద్దతు ప్రకటించిన అధ్యక్షుడు - అమెరికా అధినేతతో భారత ప్రధాని ఏడోసారి భేటీ.. పలు అంశాలపై చర్చలు వాషింగ్టన్: అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఒమామాతో భేటీ అయ్యారు. గత రెండేళ్లలో ఇరువురు అగ్ర నేతలూ భేటీ కావటం ఇది ఏడోసారి. గంట పాటు సాగిన ఈ భేటీలో.. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం, క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో భారత్ ప్రవేశం, వాతావరణ మార్పు, ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మార్గాలపై మంతనాలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా.. ప్రజల మధ్య పరస్పరం బలమైన సంబంధాలున్న భారత్, అమెరికాలు తమ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవటం సహజమని ఒబామా పేర్కొన్నారు. ఇరువురమూ విస్తృత అంశాలపై చర్చించామని, ప్రత్యేకించి ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లటం గురించి మాట్లాడామని మోదీ తెలిపారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... భారత ప్రగతికి సాంకేతికత అవసరం: ఒబామా ‘‘ఎన్ఎస్జీలో భారత్ భాగస్వామ్యానికి నేను మద్దతు తెలిపాను. భారత్ తన ప్రగతికి, సుసంపన్నత సాధించటానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకం. అది భారత్‌కు అవసరం. పౌర అణు ఒప్పందంపై పురోగతి పైనా చర్చించాం. అణు పదార్థాలు, సాంకేతికత వ్యాప్తి నిరోధం గురించి కూడా చర్చించాం. అణు భద్రత శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి (మోదీ) చాలా క్రియాశీలంగా సమర్థవంతంగా పాల్గొన్నారని కూడా నేను ప్రస్తావించాను. భద్రతకు సంబంధించి పాత సవాళ్లతో పాటు.. సైబర్ భద్రత వంటి కొత్త సవాళ్ల గురించీ చర్చించాం. వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఎలా అమలులోకి తీసుకురాగలమనే దానిపై చర్చించాం. ప్రధాని మోదీ రచించిన సౌరశక్తి, పరిశుభ్ర ఇంధనం ప్రణాళికలపై ఎలా ముందుకు వెళ్లటం అనే దాని గురించి మాట్లాడాం. ముఖ్యమైన ప్రాంతీయ అంశాలపైనా మాట్లాడాం. శాంతి, అభివృద్ధి ఆకాంక్షలను, క్లిష్టమైన అంశాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలన్న అంశాలపై భారత్, అమెరికాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.’’ కొత్త రంగాల్లో కలిసి పనిచేయాలి: మోదీ ‘‘ఎంటీసీఆర్, ఎన్ఎస్జీల్లో సభ్యత్వాలకు నా మిత్రుడు, అధ్యక్షుడు ఒబామా చేసిన సాయం, ఇచ్చిన మద్దతుకు నేను కృతజ్ఞుడ్ని. భారత్, అమెరికాలు కేవలం ఇరు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనటానికి భుజం భుజం కలిపి పనిచేశాయి. వాతావరణ మార్పు, అణు భద్రత, ఉగ్రవాదం వంటి ప్రపంచ అంశాలపై భారత్, అమెరికాలు సహకరించుకుంటున్నాయి. కేవలం మిత్రులుగానే కాదు.. రెండు దేశాలుగా పనిచేయటం పట్ల నేను గర్వంగా భావిస్తున్నా. మేం భుజం భుజం కలిపి పనిచేయటం కొనసాగిస్తాం. మనం కొత్త రంగాల్లో ఎంత ఎక్కువగా కలిసి పనిచేస్తే.. అంత ఎక్కువగా ప్రపంచానికీ, మన రెండు దేశాలకూ కూడా ప్రయోజనం కలుగుతుంది. అది మన స్వప్నం. భారత్‌లోని 35 ఏళ్ల లోపున్న 80 కోట్ల యువత నైపుణ్యాల గురించి అమెరికాకు బాగా తెలుసు. మా యువశక్తి అమెరికాతో కలిసి కొత్త శిఖరాలకు చేరుకోవటానికి కృషి చేయగలదు. ప్రపంచంలో ఇప్పుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్.. మన రెండు దేశాలూ మరిన్ని కొత్త రంగాల్లో సహకరించుకోవాలి. నేను, ఒబామా మళ్లీ సెప్టెంబర్ నెలలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (చైనా)లో కలుస్తాం. అప్పటికల్లా.. వాతావరణం, న్యాయం సహా చాలా రంగాల్లో పురోగతి సాధించగలమని నేను ఆశిస్తున్నా.’’ మోదీ నాయకత్వం కొత్త ఉత్సాహాన్నిస్తుంది... మోదీని ఒబామా సాదరంగా కౌగిలించుకుని ఆహ్వానించారు. ‘‘ఓవల్ కార్యాలయంలోకి నా మిత్రుడ్ని తిరిగి ఆహ్వానించటం నాకు చాలా సంతోషకరం. మోదీ నాయకత్వం కేవలం భారతీయ అమెరికన్లలోనే కాదు, అమెరికన్లలో కూడా కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది’’ అంటూ కితాబునిచ్చారు. గత ఏడాది జనవరిలో భారత గణతంత్ర దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరవటం గురించి ఒబామా గుర్తుచేస్తూ అక్కడ తనకు అపూర్వ ఆతిథ్యం లభించిందన్నారు. చర్చలు ముగిసి, మీడియాతో మాట్లాడిన అనంతరం మోదీకి ఒబామా మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ విందు భేటీలోనూ చర్చలు కొనసాగించారు. ఒబామాతో భేటీ ముగిశాక.. వ్యాపార దిగ్గజాల సమావేశానికి మోదీ హాజరయ్యారు. ఆయన ఆ తర్వాత అమెరికా - భారత్ వాణిజ్య మండలి వార్షిక సర్వసభ్య భేటీలో ప్రసంగించారు. బుధవారం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మెక్సికో పర్యటనకు వెళ్తారు. క్షిపణి విపణిలోకి భారత్.. ఎంటీసీఆర్‌లో సభ్యత్వం ఖరారు న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో విజయం! క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో భారత్‌ను సభ్యదేశంగా చేర్చుకోవటానికి అందులోని సభ్యదేశాలన్నీ ఆమోదం తెలిపాయి. మొత్తం 34 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశమూ భారత్ చేరికకు అభ్యంతరం తెలుపలేదని దౌత్యవేత్తలు మంగళవారం వెల్లడించారు. భారత్ దరఖాస్తుపై అభ్యంతరాలను వ్యక్తం చేయటానికి సోమవార (జూన్ 6) తుది గడువు కాగా.. ఏ దేశం నుంచీ అభ్యంతరం రాలేదు. ఎంటీసీఆర్ సభ్య దేశాల నుంచి అభ్యంతరాలు రాకపోతే దరఖాస్తు చేసుకున్న దేశానికి సభ్యత్వం లభించినట్లేనన్న ఆ వ్యవస్థ అనుసరిస్తున్న విధానం మేరకు.. భారత్ సభ్యత్వానికి ఆమోదం లభించినట్లేనని ఆ సంస్థకు చెందిన దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడుఒబామాతో భేటీ కావటానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం. ఏమిటీ ఎంటీసీఆర్? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భాగంగా.. అణ్వస్త్రాలు, రసాయన, జీవరసాయన సామూహిక జనహనన మారణాయుధాలను ప్రయోగించేందుకు వీలుకలిగించే క్షిపణులు, వాటి సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తిని నియంత్రించేందుకు 1987లో అప్పటి జీ7 కూటమిగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు దీనిని నెలకొల్పాయి. ఇసభ్యదేశాలు 500 కిలోలు అంతకుమించి పేలోడ్‌ను మోసుకెళ్లగల, 300 కి.మీ. అంతకు మించిన దూరానికి ప్రయాణించి ఎసామూహిక జనహనన మారణాయుధాన్నైనా ప్రయోగించగల క్షిపణులు, సంబంధిత సాంకేతికతల ఎగుమతులపై నియంత్రణ పాటిస్తాయి. భారత్‌కు లాభాలేమిటి? ఎంటీసీఆర్ సభ్య దేశంగా భారత్.. ఉన్నతస్థాయి ఆదునిక క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయగలగటమే కాకుండా.. ఎగుమతి కూడా చేయగలదు. ప్రత్యేకించి లక్షిత ప్రాంతాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగల ప్రిడేటర్ డ్రోన్లను కూడా అమెరికా నుంచి కొనుక్కునే వీలు కలుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల తన క్షిపణులను భారత్ సైతం ఎగుమతి చేయగలదు. ప్రధానంగా భారత్, రష్యాలు కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించేందుకు వీలవుతుంది. -
మోదీ, ఒబామా ఆత్మీయ ఆలింగనం
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్‌హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. భారత్‌లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలలో తాను పాల్గొన్న రోజులను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అమెరికాతో కలిసి పని చేయడానికి సిద్ధమని, ఎన్నో సమస్యలపై పోరాడతామని మోదీ పేర్కొన్నారు. పలు సమస్యలపై ఒబామాతో చర్చించామని, తనను ఇక్కడకు ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ యంగ్ కంట్రీ అని, దేశంలో 80 కోట్ల జనాభా 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. దేశ యువకులు అమెరికాతో కలిసి పనిచేస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. పౌర అణు సహకారం, ప్రాంతీయ సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. జీ20 సదస్సులో మరోసారి ఒబామాతో సమావేశం అవుతామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
140గంటలు.. ఐదు దేశాలు.. 33,000 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తాను దృఢమైన వ్యక్తి అని నిరూపించుకున్నారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తనదైన ముద్రను వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 140గంటల్లో ఆయన ఐదు దేశాలు చుట్టేశారు. దాదాపు 33 వేల కిలో మీటర్లు ప్రయాణించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ కేవలం అలుపులేకుండా 140 గంటల్లో ఐదు దేశాలు చుట్టేయడం చెప్పుకోదగిన విషయమే. అంతేకాకుండా, ఈ ఐదు దేశాల్లో ఆయన దాదాపు 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 గంటలపాటు విమానంలో ప్రయాణించారు. మోదీ తిరిగి ఢిల్లీలో ఈ నెల పదిన ఉదయం 5గంటలకు అడుగుపెట్టనున్నారు. 'ఐదు దేశాలు, 45కు పైగా సమావేశాలు.. అది ఇక్కడ కావొచ్చు.. విదేశాల్లో కావొచ్చు.. నేను దేశం కోసమే పనిచేస్తున్నాను' అని మోదీ గత ఆదివారం దోహాలో చెప్పిన విషయం తెలిసిందే. -
పాక్ తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలు కోరుకుంటోంది
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విమర్శించారు. గురువారం మీరట్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే శంకుస్థాపన సందర్భంగా మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో చిదంబరం శుక్రవారం ప్రతిస్పందించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ సహకరిస్తున్నా మోదీ అనవసరంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని చిదంబరం వాపోయారు. భారతీయ జనతాపార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని చిదంబరం విమర్శిచారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌ను తప్పుపట్టడం సరికాదని, కాంగ్రెస్‌కు ఆ బిల్లుపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో కాంగ్రెస్ కూడా సత్సంబంధాలను కోరుకుంటుందని, అయితే హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు, యూటర్న్లు సత్ఫలితాలను ఇవ్వవని ప్రధాని పాక్ పర్యటనను ఉద్దేశించి చిదంబరం మాట్లాడారు. లోక్‌సభలో 67 బిల్లులు, రాజ్యసభలో 45 బిల్లులు పాస్ కావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను అకారణంగా ప్రధాని విమర్శించడం సరికాదన్నారు. -
అన్నదాత.. ఖర్మదాత
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యల పర్వం కొన సాగుతోంది. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యల మీద లేదని, పరిహారం కూడా ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇద్దరు సీఎంలకూ విదేశీ పర్యటనలకే సమయమంతా సరిపోతోంది కానీ రైతు సమస్యల గురించి పరిష్కారదిశగా కృషి చేయటం లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో సరైన లెక్కలేదుగానీ నష్టపరిహారం ప్రకటనలు గుప్పించడంలో మాత్రం సీఎంలు పోటీ పడుతున్నారు. ఇంతవరకు ఎంత మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చారన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. పెట్టుబడులను ఆకర్షించడా నికి దేశాంతరాలు దాటగలుగుతున్న ఏలికలకు రైతు సదస్సులు నిర్వహించి కాసింత భరోసా ఇవ్వడానికి మాత్రం సమయంలేనట్లుంది. ఆంధ్ర, తెలంగాణల్లో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ఇకనైనా నివారణ మార్గాలు కనిపెట్టండి. అన్నదాతలను ఖర్మదాతలుగా మార్చకండి. - పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్