రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యల పర్వం కొన సాగుతోంది. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యల మీద లేదని, పరిహారం కూడా ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇద్దరు సీఎంలకూ విదేశీ పర్యటనలకే సమయమంతా సరిపోతోంది కానీ రైతు సమస్యల గురించి పరిష్కారదిశగా కృషి చేయటం లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో సరైన లెక్కలేదుగానీ నష్టపరిహారం ప్రకటనలు గుప్పించడంలో మాత్రం సీఎంలు పోటీ పడుతున్నారు.
ఇంతవరకు ఎంత మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చారన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. పెట్టుబడులను ఆకర్షించడా నికి దేశాంతరాలు దాటగలుగుతున్న ఏలికలకు రైతు సదస్సులు నిర్వహించి కాసింత భరోసా ఇవ్వడానికి మాత్రం సమయంలేనట్లుంది. ఆంధ్ర, తెలంగాణల్లో కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ఇకనైనా నివారణ మార్గాలు కనిపెట్టండి. అన్నదాతలను ఖర్మదాతలుగా మార్చకండి.
- పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్
అన్నదాత.. ఖర్మదాత
Published Fri, Sep 25 2015 1:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement