![భారత్ చేరుకున్న మోదీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41428611822_625x300_0.jpg.webp?itok=qOLYorzX)
భారత్ చేరుకున్న మోదీ
న్యూఢిల్లీ: మూడు దేశాల విదేశీ పర్యటనని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున భారత్ చేరుకున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో ప్రధాని మోదీ 9 రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది. పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియాకు ప్రచారం, పలు ద్వైపాక్షిక అంశాల్లో సహకారం.. ప్రధాన లక్ష్యాలుగా మోదీ పర్యటన సాగింది. ఫ్రాన్స్‌తో రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జర్మనీలో మేక్ ఇన్ ఇండియాకు లభించిన మద్దతు, యురేనియం సరఫరాకు కెనడా అంగీకారం.. మోదీ పర్యటనలో కీలక విజయాలుగా పేర్కొనవచ్చు.
పలంలోని టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి ప్రత్యేక విమానంలో చేరుకన్న మోదీకి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయతో పాటు పలువురు ఎంఎల్ఏలు స్వాగతం పలికారు.