సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం ఉదయం అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులతో పాటు సీఆర్ఫీఎఫ్ డీజీ కూడా సమావేశానికి వచ్చారు. (ఉగ్ర మారణహోమం)
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు కశ్మీర్ వెళ్లనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. (12 కి.మీ వరకూ పేలుడు శబ్దం)
Comments
Please login to add a commentAdd a comment