పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చటం జరిగే పనికాదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చటం జరిగే పనికాదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కొత్త సమస్యలు సృష్టించేందుకే పోలవరంపై రగడ చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు, పోలవరం ఆర్డినెన్స్ అంశాలు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నాయని సుజనా చౌదరి తెలిపారు.
దీనిపై ఇప్పుడు కొత్తగా గొడవ చేయాల్సిన పనిలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధానిపై నిర్ణయం తీసుకుంది బీజేపీ,టీడీపీలు కాదని సుజనా చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి తగ్గట్టుగా ఉందన్నారు. కాగా వచ్చే రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.