వీడియో హల్‌చల్: పోలీసులపై వేటు | police suspended in Anti Romeo squad shaved youth head issue | Sakshi
Sakshi News home page

వీడియో హల్‌చల్: పోలీసులపై వేటు

Published Sat, Apr 1 2017 5:46 PM | Last Updated on Tue, Aug 21 2018 8:14 PM

వీడియో హల్‌చల్: పోలీసులపై వేటు - Sakshi

వీడియో హల్‌చల్: పోలీసులపై వేటు

షాజహాన్‌పూర్‌: యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీస్తున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. ఉత్తరప్రదేశ్‌ లోని అజీజ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ కేవీ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సౌత్‌సిటీ కాలనీలో ఓ యువజంట తిరుగుతున్నట్లు అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ముగ్గురు కానిస్టేబుళ్లు, యాంటీ రోమియో స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్లేసరికే ఆ జంటను స్థానికులు పట్టుకుని బంధించారు.

యువతిని వెంటేసుకుని తిరుగుతున్నావంటూ యాంటీ రోమియో స్క్వాడ్ ఆ యువకుడికి గుండుగీశారు. ఆ కానిస్టేబుళ్లు చూస్తూ ఊరుకున్నారే తప్ప అడ్డుకునే యత్నం చేయకపోగా.. ఓ కానిస్టేబుల్‌ ఈ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో సుహేల్‌ అహ్మద్‌, లాయక్‌ అహ్మద్‌, సోన్‌పాల్‌ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కానిస్టేబుళ్లను వెనకేసుకొచ్చేందుకు యత్నించిన అజీజ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి కేకే చౌదరిపై విచారణకు ఆదేశించారు.

ఈ మొత్తం ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. ఈవ్‌టీజింగ్‌ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్‌ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement