న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం సహా కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రుల భవితవ్యం గురువారం తేలనుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలిసే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెప్పారు.
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్లో మాత్రమే అధికార పార్టీ మళ్లీ గెలవనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలు తెలిపాయి. ఇక మిగిలిన తమిళనాడు (జయలలిత-అన్నా డీఎంకే), కేరళ (ఉమెన్ చాందీ-కాంగ్రెస్), పుదుచ్చేరి (రంగస్వామి), అసోం (తరుణ్ గొగోయ్- కాంగ్రెస్)లో అధికార పార్టీలకు పరాజయం తప్పదని జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారని స్థానిక మీడియా ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో తమిళనాడు ఫలితాలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది.
రేపు తేలనున్న ఐదుగురు సీఎంల భవితవ్యం
Published Wed, May 18 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement