శ్రీనగర్/రాంచీ/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లో 15 స్థానాలకు, జార్ఖండ్‌లో 13 స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో 15 స్థానాలకుగానూ 123మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జార్ఖండ్లో 13 స్థానాలకుగానూ 199మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
కాగా జార్ఖండ్లో 33.65 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే జమ్మూ కశ్మీర్లోనూ 10.50 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్, జార్ఖండ్లలో పోలింగ్ ప్రారంభం
Published Tue, Nov 25 2014 7:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement