ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్ము కశ్మీర్, జార్ఖండ్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఉదయం ట్విట్ చేశారు. ఇరు రాష్ట్రాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొవాలని కోరారు.
మరోవైపు జమ్ము కశ్మీర్లో చలి వాతావరణం వల్ల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. కాగా జమ్మూకశ్మీర్‌లో జమ్మూ ప్రాంతంలో 6 సీట్లలో, కశ్మీర్ లోయలోని 5 స్థానాల్లో, లడఖ్ ప్రాంతంలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలిదశ బరిలో ఉన్న స్థానాల్లో భదర్వాలో అత్యధికంగా 1,04,354 పైగా ఓటర్లుండగా, లడఖ్ ప్రాంతంలోని నోబ్రాలో 13,054 మంది మాత్రమే ఓటు హక్కు కలిగిన వారు ఉన్నారు. భదర్వా బరిలోనూ అత్యధికంగా 13 మంది అభ్యర్థులుండటం విశేషం.