![చెన్నైను ముంచెత్తినా.. ఆలయాల్లోకి చేరని వరద - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81449237708_625x300.jpg.webp?itok=wuftMZeo)
చెన్నైను ముంచెత్తినా.. ఆలయాల్లోకి చేరని వరద
చెన్నై: భారీ వర్షాలు, వరదల వల్ల చెన్నైలో రైల్వే ట్రాక్లు మునిగిపోయాయి.. రోడ్లన్నీ కాలువల్లా మారాయి.. విమానాశ్రయం జలమయమైంది.. కానీ చెన్నైలో చాలా దేవాలయాలు వరద బారిన పడకపోవడం విశేషం.
బుధ, గురువారాల్లో నగరంలో వరద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. దక్షిణ చెన్నై మైలాపూర్లోని ప్రఖ్యాత కపాలీశ్వర ఆలయంలోకి వరద నీరు రాలేదని ఆలయ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలమైంది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కేశవ పెరుమాళ్ల ఆలయంలోకి కూడా వరద నీరు రాలేదని ఆయన తెలిపారు. ఇక ట్రిప్లికేన్ ప్రాంతంలో పార్థసారథిస్వామి ఆలయం దగ్గరలో పెద్ద చెరువు ఉన్నా.. ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసినా.. ఆలయంలోకి మాత్రం వరద నీరు రాలేదని స్థానికుడు తెలిపాడు. చెన్నైలో చాలావరకు ప్రఖ్యాత దేవాలయాల్లోకి వరద నీరు రాలేదని సమాచారం.