
సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశప్రజలకు తప్పుడు హామీలిచ్చి మభ్య పెడుతోందని బాహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ అరోపించారు. దక్షిణ కన్నడ జిల్లా మంజేశ్వరలో శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సర్వధికార ధోరణి కొద్ది రోజులకు మాత్రమే పరిమితం. హిట్లర్ లాంటివారి అధిపత్యమే కూలిపోయింది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత’ అని అరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. కొంతమేర పనులు చేపట్టి ఆ తర్వాత చేతులు దులిపేసుకుందన్నారు. బీజేపీ మతత్తత్వంను పెంచి పోషిస్తూ ప్రజలను భయపెడుతుందని అరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment