జంగీపూర్: ఈసారి పశ్చిమబెంగాల్‌కు సాధారణ పౌరుడిగానే తిరిగివస్తానని రాష్ట్రపతి ప్రణబ్ తెలిపారు. తన తండ్రి కమద కింకార్ స్మత్యర్థం 2010 నుంచి జంగీపూర్‌లో నిర్వహిస్తున్న కేకేఎం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రణబ్ శుక్రవారం ప్రారంభించారు.
ఈసారి రాష్ట్రానికి 130 కోట్ల భారతీయుల్లో ఒకడిగా, సాధారణ పౌరుడిగానే తిరిగివస్తానన్నారు. తర్వాత తన ఇంటికి చేరుకున్న ఆయన పలువురు గ్రామస్తులను కలుసుకున్నారు. సత్యభారతి ఫౌండేషన్ కొత్తగా ఏర్పాటుచేసిన ఓ పాఠశాలను ప్రారంభించిన ప్రణబ్ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. జంగీపూర్ నుంచి ప్రణబ్ 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.