రాష్ట్రపతి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం | President's helicopter develops technical problem | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Published Thu, Sep 26 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

రాష్ట్రపతి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

రాష్ట్రపతి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

సాక్షి, చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బుధవార మిక్కడ నుంచి పుదుచ్చేరికి తీసుకెళ్లాల్సిన వాయిసేన హెలికాప్టర్ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఆయన, కేంద్ర మంత్రి నారాయణస్వామిలు ఎక్కిన ‘మిగ్-17’లో టేకాఫ్‌కు ముం దు సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ ఎంతకూ టేకాఫ్ కాకపోవడంతో ప్రణబ్‌ను, మంత్రిని మరో మిగ్-17 హెలికాప్టర్‌లో పుదుచ్చేరికి తీసుకెళ్లారు. చెన్నైలో భారతీయ సినిమా వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ బుధవారం పుదుచ్చేరి వర్సిటీ స్నాతకోత్సవం కోసం పుదుచ్చేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement