
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్‌వెల్త్ దేశాధినేతల సదస్సు(చోగమ్)కు హాజరుకావాలని ఆ దేశ ప్రిన్స్ చార్లెస్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. భార్య కెమిల్లా పార్కర్‌తో కలిసి 10 రోజుల ఆసియా పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్..బుధవారం మోదీతో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో భారత్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారుగా.. అక్కడ ఉపాధి కల్పనలో రెండోస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment