Commonwealth of Nations
-
రాణి అంత్యక్రియలకు సర్వం సిద్ధం
లండన్: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ఉదయం జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా బ్రిటన్ చేరుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే కానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన 96 ఏళ్ల ఎలిజబెత్–2 సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డ కట్టించే చలిలోనూ బ్రిటన్వాసులు బారులు తీరుతూనే ఉన్నారు. రాణి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి ముర్ము ఆదివారం లాంకెస్టర్ హౌస్‌ను సందర్శించారు. నివాళుల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున శోక సందేశం రాశారు. అనంతరం వెస్ట్‌మినిస్టర్ హాల్లో రాణి భౌతికకాయానికి రాష్ట్రపతితో పాటు బైడెన్ దంపతులు కూడా నివాళులు అర్పించారు. ఇలా జరుగుతుంది... ► సోమవారం ఉదయం ఆరింటికల్లా రాణి సందర్శనకు వస్తున్న సందర్శకులను నిలిపేస్తారు. ► అనంతరం తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్‌లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని అంచనా. -
‘చోగమ్’ సదస్సుకు హాజరుకండి
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ దేశాధినేతల సదస్సు(చోగమ్)కు హాజరుకావాలని ఆ దేశ ప్రిన్స్ చార్లెస్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. భార్య కెమిల్లా పార్కర్‌తో కలిసి 10 రోజుల ఆసియా పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్..బుధవారం మోదీతో ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో భారత్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారుగా.. అక్కడ ఉపాధి కల్పనలో రెండోస్థానంలో ఉంది. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ముందంజ
‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతితో కామన్వెల్త్ దేశాల్లోనే పటిష్ట దేశంగా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళయాన్ ఉపగ్రహ విజయంతో భారత్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొందన్నారు. కామన్వెల్త్ దేశాల మొదటి ‘సైన్స్ కాన్ఫరెన్స్’ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ఆవరణలో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత్‌లో అందుబాటులోకి వ చ్చిన డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలనే మార్చేసిందన్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, ఇంటర్నెట్ వినియోగంలో సైతం చైనా, అమెరికాల తర్వాత అత్యధిక మంది భారత్‌లోనే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తెలిపారు. -
కొత్తగా... వింతగా..!
అన్ని దేశాలూ ఆడితే ఒలింపిక్స్... కామన్వెల్త్ దేశాలు మాత్రమే ఆడితే కామన్వెల్త్ గేమ్స్... మరి ఒక భాష మాట్లాడే వాళ్లు ఉన్న దేశాల మధ్య గేమ్స్ జరిగితే...? అవి ‘లూసోఫోనియా గేమ్స్’. పోర్చుగీస్ భాష వాడుకలో ఉన్న దేశాల మధ్య జరిగే క్రీడలు లూసోఫోనియా క్రీడలు. (ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఆ భాష మాట్లాడే వారున్నా ఆ దేశం ఈ క్రీడల్లో పాల్గొనవచ్చు) ఈసారి ఈ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 18 నుంచి 29 వరకు 11 అంశాల్లో ఈ ఆటలు గోవాలో జరుగుతాయి. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభం పోర్చుగీసు భాష మాట్లాడే దేశాల మధ్య క్రీడలు నిర్వహించాలనే ఆలోచన 2004లో వచ్చింది. చకచకా ఏర్పాట్లు జరిగాయి. 2006లో మకావులో తొలిసారి ఈ క్రీడలు నిర్వహించారు. మకావులో జరిగిన ఈ ఈవెంట్లో 11 దేశాలకు చెందిన 733 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లిస్బన్ వేదికగా జరిగిన 2009 క్రీడల్లో 12 దేశాల నుంచి 1300 మంది బరిలోకి దిగారు. భారత్‌తోపాటు బ్రెజిల్, అంగోలా, కేప్‌వర్డె, ఈస్ట్ తిమోర్, గినియా బిసావూ, మొజాంబిక్, పోర్చుగల్, సావోతోమి ప్రిన్సిపి, ఈక్వటోరియల్ గినియా, ఘనా, ఫ్లోరెస్, మారిషస్, మొరాకో దేశాలు ఈ క్రీడల్లో పోటీపడుతున్నాయి. మళ్లీ ఇప్పుడు 2014లో భారత్‌లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. బ్రెజిల్ టాప్... గత రెండు ఈవెంట్స్‌లో బ్రెజిల్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్రెజిల్ సాధించిన మొత్తం 133 పతకాల్లో స్వర్ణాలు 62... రజతాలు 42... కాంస్యాలు 29 ఉన్నాయి. భారత్ మాత్రం ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం పది పతకాలు సాధించింది.