ముంబై : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జామియా మిలియా, ఏఎంయూ విద్యార్ధులపై పోలీసుల దమనకాండ సరైందికాదని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడంతో క్యాంపస్‌లోకి ప్రవేశించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో విద్యార్ధులపై లాఠీచార్జ్, భాష్పవాయుగోళాలు ప్రయోగించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ప్రతి బిడ్డకూ విద్య అందించాలన్నది మన కల అని, విద్యతో వారికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి వస్తుందని..వారేం చెబుతారనేది మనం వినాల్సిన అవసరం ఉందని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుతంగా గళం విప్పిన వారిపై హింసతో విరుచుకుపడటం తప్పని తేల్చిచెప్పారు. ప్రతి వ్యక్తీ గళం కీలకమని, ఇది మారుతున్న భారత్‌ను ఆవిష్కరిస్తుందని ఆమె ట్విటర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment