పుణె : కరోనా వైరస్ పుణ్యమా అని మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్ లోషన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. మాస్క్ లేనిదే బయటకు వెళ్లడంలేదు. డాక్టర్లు కేవలం ఎన్-95 మాస్కులు వాడాలని సూచిస్తున్నప్పటికీ జనం ఏదో రకమైన మాస్క్ అయినా చాలులే అని ఫిక్స్ అయ్యారు. మాస్కులు లేక పోతే చిన్న టవల్స్ లేదా కర్చీఫ్, చున్నీలు ముఖాలకు చుట్టేసుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ ధనవంతుడు మాత్రం బంగారంతో మాస్కు చేయించుకుని వార్తల్లో నిలిచాడు.
(చదవండి : కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే!)
పింప్రి చించ్‌వాడకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి సుమారు 2 లక్షల 89 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు. ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్నర తులాల బంగారం వాడినట్లు తెలుస్తోంది. బంగారంపై మక్కువతో ఆయన ఈ మాస్కు తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడానికి ఆ మాస్క్‌కు చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. శంకర్ రోజూ 3 కిలోల బరువుండే బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలు ధరిస్తాడు. బయటకు వెళ్లేప్పుడు కూడా బంగారు మాస్కునే ధరిస్తున్నాడు. దీంతో జనాలు అతడి మాస్క్‌ను చూసి నోరెళ్లబెడతున్నారు. అయితే, ఈ మాస్కు వైరస్‌ను కట్టడి చేస్తుందా లేదా అనేది కూడా అనుమానమే.
Comments
Please login to add a commentAdd a comment