నేటి నుంచి రేడియాలజిస్టుల దేశవ్యాప్త సమ్మె | Radiologists to go on nationwide strike against PCPNDT Act from September 1 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రేడియాలజిస్టుల దేశవ్యాప్త సమ్మె

Published Fri, Sep 2 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

Radiologists to go on nationwide strike against PCPNDT Act from September 1

న్యూఢిల్లీ: తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

సెప్టెంబర్ 1 నుంచే సమ్మె చేయాలని నిర్ణయించినా... కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం ఇండియన్ రేడియోలాజిక్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ తన నిర్ణయంపై పునరాలోచన చేసింది. రెండు నెలల వ్యవధిలో డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా... సరైన హామీనివ్వకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement