'మేక్ ఇన్ కాదు.. మోదీ జీ కా టేక్ ఇన్ ఇండియా'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ల్యాండ్ బిల్లును కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజావిజయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ బిల్లులు ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించినది.. 'మేక్ ఇన్ ఇండియా కాదు.. మోదీ జీ కా టేక్ ఇన్ ఇండియా' అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించటానికి మోదీకి సమయమే దొరకట్లేదా? అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.